సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు.. ప్రజలు నమ్మొద్దు హత్యాప్రయత్నం కేసులో పరారీలో ఉన్న A1 రౌడీషీటర్ పై హెచ్చరిక అసత్య పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవు: సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్

సూర్యాపేటబ్యూరో, డైనమిక్ న్యూస్, జనవరి 30 ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాప్రయత్నం కేసుకు సంబంధించి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పోలీసులపై, కేసుపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన సూచించారు. నవంబర్ 18న హత్యాప్రయత్నం కేసు నమోదు నవంబర్ 18వ తేదీన బాధితుడు జటంగి రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో హత్యాప్రయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేస్తూ బాధితుడి వాంగ్మూలం...