సూర్యాపేట ప్రజలు శాంతి, అభివృద్ధి వైపే నిలుస్తారు 34, 36 వార్డులకు నామినేషన్లు దాఖలు చేసిన గండూరి ప్రవల్లిక – ప్రకాష్ దంపతులు

డైనమిక్ న్యూస్, సూర్యాపేట, జనవరి 31 సూర్యాపేట పట్టణ ప్రజలు శాంతి, అభివృద్ధిని కోరుకునే ప్రజలని, గత పదేళ్లలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరోసారి బీఆర్‌ఎస్‌కు పట్టం కడతారని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవల్లిక, గండూరి ప్రకాష్ దంపతులు ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన దంపతులు సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 34వ వార్డు నుంచి గండూరి ప్రకాష్, 36వ వార్డు నుంచి గండూరి ప్రవల్లికలు తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. పదేళ్ల...