అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య భార్య లక్ష్మి, మేనల్లుడు గణేష్‌కు రిమాండ్

డైనమిక్ న్యూస్, మాడ్గులపల్లి, ఫిబ్రవరి 1 మండలంలోని సీత్యా తండాకు చెందిన రమావత్ రవిని హత్య చేసిన కేసులో అతని భార్య దీరావత్ లక్ష్మి, ఆమె మేనల్లుడు గణేష్‌లను రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ పీఎన్‌డీ ప్రసాద్, ఎస్సై కృష్ణయ్య శనివారం తెలిపారు. పదిహేను ఏళ్ల క్రితం వివాహం రమావత్ రవి (సీత్యా తండా) గత 15 సంవత్సరాల క్రితం మిర్యాలగూడ మండలం ఏడు కోట్ల తండాకు చెందిన దీరావత్ లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అక్రమ సంబంధంతో కుటుంబ కలహాలు లక్ష్మికి తన మేనల్లుడు గణేష్‌తో అక్రమ సంబంధం ఉండటంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. మృతుడు...