మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కఠినంగా ఎన్నికల కోడ్ అమలు ఈనెల 11న పోలింగ్ – సభలు, సమావేశాలు, వాహనాలు, మైక్ వినియోగానికి తప్పనిసరి అనుమతులు

డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, ఫిబ్రవరి 3 మున్సిపల్ ఎన్నికలు ఈనెల 11వ తేదీన జరగనున్న నేపథ్యంలో పట్టణంలో ఎన్నికల కోడ్‌తో పాటు 30 పోలీస్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ రవీందర్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను కాపాడడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్ ఐ రవీందర్ తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిషేధం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీల నాయకులు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందస్తుగా తప్పనిసరిగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని ఎస్‌ఐ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు...