కర్ల రాజేష్ సంతాప సభలో మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు రాజేష్ కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయాలి – బాధ్యుడైన ఎస్సైను వెంటనే విధుల నుంచి తొలగించాలి
మోతే మండలం, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 3 మోతే మండలం మోతే గ్రామంలో కర్ల రాజేష్ సంతాప సభకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ల రాజేష్ మృతికి కారణమైన ఎస్సై సురేష్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజేష్ కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయడంతో పాటు, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి రాజేష్ మరణంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే,...