ఫౌండేషన్ కోర్సు దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 22 వరకు పొడగింపు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి బి. శశికళ వెల్లడి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 4 తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు కోసం దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి బి. శశికళ తెలిపారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు – పోటీ పరీక్షల శిక్షణకు అవకాశం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ వంటి పోటీ పరీక్షల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా...