మిర్యాలగూడ నుంచే మున్సిపల్ ఎన్నికల తొలి సమరం : సీఎం రేవంత్ రెడ్డిఏప్రిల్ బడ్జెట్‌లో మరోసారి లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు – పేదల ఆత్మగౌరవమే ప్రభుత్వ లక్ష్యం

మిర్యాలగూడ, డైనమిక్ డెస్క్ న్యూస్, ఫిబ్రవరి 4 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టనున్న నూతన బడ్జెట్‌లో మరోసారి లక్షలాది ఇందిరమ్మ ఇండ్లను పేదలకు మంజూరు చేసి వారి ఆత్మగౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పరిధిలోని గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన సభకు ముందు రూ.200 కోట్ల వ్యయంతో మిర్యాలగూడ నియోజకవర్గంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో ఇలాంటి 100 పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్...