నేరేడుచర్లలో బీఆర్ఎస్‌కు బలం.. కాంగ్రెస్‌కు షాక్ ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు పాలువాయి కృష్ణమూర్తి బీఆర్ఎస్‌లో చేరిక గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,ఫిబ్రవరి 6 మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి నేరేడుచర్లలో గట్టి షాక్ తగిలింది. ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ పాలువాయి కృష్ణమూర్తి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమన్వయకర్త ఆధ్వర్యంలో చేరికలు హుజూర్నగర్ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. హాజరైన నేతలు నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ...