ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో కారు ప్రమాదం సహాయక చర్యలు చేపట్టిన అధికారులు – కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ ఫిబ్రవరి 8 నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద ఉన్న ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో శనివారం రాత్రి కారు అదుపు తప్పి పడిపోయిన ఘటనపై రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ఆదివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి కలెక్టర్ ముకుందాపురం వద్ద ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. సంఘటనకు గల కారణాలు, ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు, ఇతర అంశాలను స్థానికులు, అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. భార్య మృతి – భర్త...