నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు బీజేపీ–బీఆర్‌ఎస్‌కు ఓటు అంటే డ్రైనేజీలో వేసినట్లే శాంతినగర్ ఆటోనగర్ రద్దు – నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

డైనమిక్ న్యూస్, నేరేడుచర్ల, ఫిబ్రవరి 9 నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు అయిన సోమవారం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ ఎత్తున రోడ్డు షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో భాగంగా ఆయన ముందుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్డు షో ద్వారా ప్రజలను నేరుగా కలిశారు. ఎన్నికల ప్రచారానికి తుది ఘట్టంగా జరిగిన ఈ కార్యక్రమం నేరేడుచర్లలో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. భారీ బైక్ ర్యాలీ – రోడ్డు షోతో హోరెత్తిన ప్రచారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన బైక్ ర్యాలీ, రోడ్డు షోకు...