సూర్యాపేట జిల్లావ్యాప్తంగా యూరియా యాప్ గందరగోళం గంటల తరబడి డౌన్ అయిన సర్వర్‌తో రైతులకు తీరని వేదన జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన యూరియా పంపిణీ

డైనమిక్ న్యూస్, సూర్యాపేట బ్యూరో, ఫిబ్రవరి 10 సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మంగళవారం  యూరియా బస్తాల పంపిణీ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ, ఆన్లైన్ సర్వర్ గంటల తరబడి పనిచేయకపోవడంతో రైతులకు యూరియా అందడం లేదు. పీఓఎస్ మిషన్‌లో ఆధార్ ఓటీపీ తప్పనిసరి అంటూ అధికారులు నిబంధనలు విధించడంతో జిల్లా అంతటా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నేరేడు చర్ల మండలంలోనూ అదే పరిస్థితి జిల్లాలోని నేరేడు చర్ల మండలం పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. యూరియా కోసం రైతులు సహకార కేంద్రాలు, ఎరువుల డీలర్ షాపుల వద్ద గంటల తరబడి ఎదురుచూసినా, సర్వర్ డౌన్ అంటూ...