విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ – సివిల్ సప్లైస్ సంయుక్త దాడులు చిల్లేపల్లిలో రేషన్ డీలర్‌పై 6A కేసు నమోదు

డైనమిక్ న్యూస్, నేరెడ్‌చర్ల , ఫిబ్రవరి 10 నేరెడ్‌చర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ నల్లగొండ విభాగం మరియు సివిల్ సప్లైస్ శాఖ అధికారులు మంగళవారం సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలకు దిగిన అధికారులు ఈ తనిఖీలను విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ నల్లగొండ విభాగం సీఐ దశరథ, సివిల్ సప్లైస్ శాఖ రివెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ కలిసి నిర్వహించారు. రేషన్ షాపులో నిల్వల తనిఖీ చిల్లేపల్లి గ్రామంలోని రేషన్ షాప్ నెం. 4015004 వద్ద రేషన్ డీలర్రవి గుప్తా (తండ్రి: లక్ష్మీ నర్సయ్య) వద్ద ఉన్న బియ్యం నిల్వలను అధికారులు పరిశీలించారు. బియ్యం నిల్వల్లో భారీ తేడా పుస్తకాల ప్రకారం...