నేరేడు చర్లలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్మొత్తం 79.24 శాతం ఓటింగ్ నమోదు – మహిళల పాల్గొనడం పురుషుల కంటే అధికం
నేరేడుచర్ల, ఫిబ్రవరి 11, డైనమిక్ న్యూస్ నేరేడు చర్ల మున్సిపాలిటీలో జరిగిన 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంత వాతావరణంలో సాఫీగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించబడింది. అధికారులు, పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య – 13,746 నేరేడు చర్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 13,746 మంది ఓటర్లు నమోదు కాగా, అందులో పురుషులు – 6,629 మహిళలు – 7,116 ఇతరులు – 1 మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే...