నేరేడు చర్ల మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు 79.24 శాతం పోలింగ్ నమోదు – త్రిముఖ పోటీలో ప్రధాన పార్టీల ప్రతిష్ట పణంగా

నేరేడు చర్ల, ఫిబ్రవరి 11, డైనమిక్ న్యూస్ నేరేడు చర్ల మున్సిపాలిటీలో జరిగిన రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ముగిసింది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కొనసాగింది. మొత్తం 79.24 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. ఈసారి ఎన్నికలు త్రిముఖ పోటీగా మారడంతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. త్రిముఖ పోటీతో ఉత్కంఠ భరిత సమరం ఈ ఎన్నికల్లో ప్రధానంగా మూడు వర్గాల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ పార్టీ అన్ని వార్డుల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ సీపీఐ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. బీఆర్‌ఎస్ పార్టీ సీపీఎం, జనసేన...