మూసి తీరాన మహాశివరాత్రి వేడుకలు సోమప్ప సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు – పోలీసు అధికారుల దర్శనం
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 15 మండల పరిధిలోని సోమారం, బూర్గుల తండా గ్రామాల సమీపంలో మూసి నది తీరాన వెలసిన ప్రసిద్ధ సోమప్ప సోమేశ్వర ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా భక్తి భావంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు, స్థానిక ఎస్‌ఐ రవీందర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక అర్చనలు చేయించారు. భక్తి వాతావరణంలో మహాశివరాత్రి ఉత్సవాలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ఆలయంలో రుద్రాభిషేకాలు, లింగార్చనలు, బిల్వార్చనలు నిర్వహించారు. మూసి తీరాన ఉన్న ఈ ఆలయం సహజ సౌందర్యంతో కూడిన పవిత్ర క్షేత్రంగా పేరుపొందింది. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా సమీప గ్రామాల నుంచి...