నల్గొండలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నాణ్యమైన విద్యతో విద్యార్థుల భవిష్యత్తు బలపడాలి – డాక్టర్ జి.వి. రమేష్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 15 నల్గొండలోని MJPTBCWRs (G) Nalgonda పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ జి.వి. రమేష్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల ద్వారా పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేయాలని సూచించారు. లక్ష్య సాధనలో నిరంతర కృషి అవసరం విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన...