దళితుల రక్షణకు జాతీయ ఎస్సీ కమిషన్ కట్టుబాటు కర్ల రాజేష్ కేసుపై అధికారులపై ఆగ్రహం – త్వరితగతిన చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రరావు ఆదేశం

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 16 దళితుల హక్కుల పరిరక్షణకు జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రరావు స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా లోనీ కోదాడ పట్టణంలో సోమవారం ఇటీవల పోలీసు లాక్‌అప్‌లో మరణించిన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.రాజేష్ తల్లి లలితమ్మను కలిసి మృతికి గల కారణాలను తెలుసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు. సుమోటో కేసు నమోదు – చార్జ్‌షీట్ ఆలస్యంపై ప్రశ్నలు తదుపరి కోదాడ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషన్ సభ్యులు మాట్లాడుతూ, కర్ల రాజేష్ కేసును పత్రికల ద్వారా గమనించి కమిషన్ సుమోటోగా నమోదు చేసిందన్నారు....