నేరేడు చర్ల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ ఆధిక్యం ఆరుగురు వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 16 నేరేడు చర్ల మున్సిపాలిటీలో తాజా ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. మొత్తం ఆరు వార్డుల్లో విజయాన్ని అందుకొని మున్సిపల్ పాలనలో కీలక స్థానాన్ని సంపాదించింది. ఇందులో ఐదు వార్డులు బీఆర్‌ఎస్ పార్టీకి నేరుగా దక్కగా, మరో ఒక వార్డు బీఆర్‌ఎస్–జనసేన పొత్తు ద్వారా జనసేన అభ్యర్థి గెలుపొందడం విశేషం.సోమవారం జరిగిన మున్సిపల్ కార్యాలయంలో గెలుపొందిన ఆరుగురు వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు...