లాల్ లక్ష్మీపురంలో ప్రజాబాట – విద్యుత్ సమస్యలపై అధికారుల ప్రత్యక్ష పరిశీలనట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె ఎత్తు పెంచేందుకు తక్షణ చర్యలు

నేరేడుచర్ల, ఫిబ్రవరి 17, డైనమిక్ న్యూస్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు చేపట్టిన “ప్రజా బాట” కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు నేరేడు చర్ల మండల పరిధిలోని లాల్ లక్ష్మీపురం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు పర్యటించారు. గ్రామ సర్పంచ్ పర్వతం చిన్న వెంకన్న సమన్వయంతో విద్యుత్ ఏఈ సృజన గ్రామంలోని పలు విద్యుత్ సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెపై ఆందోళన గ్రామంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె చాలా కిందికి ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సర్పంచ్ వెంకన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దిమ్మె తక్కువ ఎత్తులో ఉండటం వల్ల కరెంట్ షాక్‌కు గురై మేకలు వంటి మూగజీవాలు...