రైల్వే బ్రిడ్జి పనులు నిర్దేశిత గడువులో పూర్తవ్వాలి: కలెక్టర్– శంకర్ విలాస్ ఆర్వోబి పనులపై సమీక్ష– ఏటుకూరు కంపోస్ట్ యార్డు పరిశీలన– వ్యర్థాల నిర్వహణలో మరింత సామర్థ్యం పెంచాలి

డైనమిక్ న్యూస్,గుంటూరు, ఫిబ్రవరి 17 శంకర్ విలాస్ రైల్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబి) నిర్మాణ పనులు నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి అయ్యేలా కాంట్రాక్ట్ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ రోడ్లు & భవనాల శాఖ (ఆర్ అండ్ బి), నగరపాలక సంస్థ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు.మంగళవారం శంకర్ విలాస్ ఆర్వోబి నిర్మాణ పనులను, ఏటుకూరు రోడ్డులోని కంపోస్ట్ యార్డును జిల్లా కలెక్టర్ అన్సారియా, నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ సంయుక్తంగా పరిశీలించారు. బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిడ్జి పిల్లర్లు, డ్రైనేజీ నిర్మాణాలు తదితర పనులు ప్రణాళిక ప్రకారం...