ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి– జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 17 ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం పర్వతగిరి ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, మందుల స్టాక్‌పై ప్రత్యేక దృష్టి ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, మందుల స్టాక్ రిజిస్టర్, స్టోర్ గది, మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, మందుల స్టాక్ రిజిస్టర్‌ను నిరంతరం అప్డేట్ చేయాలని ఆదేశించారు.మందుల అందుబాటుపై వివరాలు...