చిల్లేపల్లి మేజర్-2 కాలువలో నాచు సమస్య చివరి భూములకు నీరు లేక రైతుల ఆందోళన

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 23 చిల్లేపల్లి మేజర్-2 కాలువలో ఫతేపురం – వైకుంఠపురం పరిధిలో భారీగా నాచు (నీటి మొక్కలు) పేరుకుపోవడంతో కాలువ చివరి భాగంలోని సాగు భూములకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ప్రవాహం పూర్తిగా అడ్డంకి కావడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం… రైతులే ముందడుగు కాలువ శుభ్రత పనులు ఆలస్యం కావడంతో సంబంధిత శాఖలపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలు మార్లు తెలియజేసినా స్పందన రాకపోవడంతో కాలువ చివరి భాగంలో ఉన్న రైతులు తలా కొంత మొత్తంలో డబ్బులు సేకరించి స్వచ్ఛందంగా పనులు చేపట్టారు.సోమవారం పొక్లైన్ యంత్రాన్ని ఏర్పాటు చేసి...