అభినందన సన్మానసభ జిల్లాస్థాయి భజన పోటీల విజేతలకు ఘన సత్కారం

డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్, ఫిబ్రవరి 23 ఇటీవల గడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన జిల్లాస్థాయి భజన పోటీలలో హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన శ్రీ అన్నమయ్య భజన మండలి ప్రథమ బహుమతి, శ్రీ గీతాగోవిందం భజన మండలి ద్వితీయ బహుమతి సాధించిన సందర్భంగా కనకదుర్గ సేవా సమాజం ఆధ్వర్యంలో అభినందన సన్మాన సభ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం శ్రీ బాచిమంచి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా హాజరై విజేత భజన మండలి సభ్యులను శాలువాలు, స్మృతిచిహ్నాలతో ఘనంగా సత్కరించారు. భజన బృందాల సేవ అభినందనీయం ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్...