డాక్టర్లు మానవత్వంతో సేవలందించాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మెడికల్ కళాశాలను రాష్ట్రంలో ఉత్తమంగా తీర్చిదిద్దుతాం – ఏసీ బస్సులు మంజూరు
నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్ ఫిబ్రవరి 26 డాక్టర్లు తెల్లకోటుకు పరిమితం కాకుండా మానవతా దృక్పథంతో పేదలకు వైద్యసేవలు అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. గురువారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన “అద్వితీ-2026” వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య వృత్తి పవిత్రమైనది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి అత్యంత పవిత్రమైందని అన్నారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటైందని, ఇక్కడ చదివే విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు మానవత్వాన్ని కూడా అలవరచుకోవాలని సూచించారు. తెల్లకోటు బాధ్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. కళాశాలలో ఉన్న...