జిల్లాలో తొలి బ్లైండ్ విద్యార్థుల డిజిటల్ లైబ్రరీ కార్నర్ ప్రారంభం సమాన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం – చైర్మన్ ఎం.ఏ. ఆఫీజ్ ఖాన్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 26 నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బ్లైండ్ (దృష్టి లోపం ఉన్న) పాఠకులు, విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ లైబ్రరీ కార్నర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఏ. ఆఫీజ్ ఖాన్ గురువారం ప్రారంభించారు. జిల్లాలో తొలిసారిగా ఈ సదుపాయం ప్రారంభించడం గర్వకారణమని ఆయన తెలిపారు.విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బ్లైండ్ విద్యార్థుల కోసం బ్రెయిలి పుస్తకాలు, ఆడియో బుక్స్, ఈ-బుక్స్, స్క్రీన్ రీడర్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్లు, ప్రత్యేకంగా చదువుకునే విభాగం, సహాయక సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2026–27...