సూర్యాపేటలో ఇంటర్ పరీక్షల కోసం ఎగ్జామ్ కిట్ల కొనుగోలు ఫిబ్రవరి 28న కోటేషన్ల స్వీకరణ – జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటన
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 26 సూర్యాపేట జిల్లాలో నిర్వహించనున్న 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం అవసరమైన ఎగ్జామినేషన్ కిట్ల సరఫరాకు జిల్లా విద్యాశాఖ అధికారి కోటేషన్లు ఆహ్వానించారు. ఫిబ్రవరి 28, 2026న మధ్యాహ్నం 2 గంటల వరకు కోటేషన్లు స్వీకరించబడతాయని వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు కోటేషన్ల తెరవడం ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయం (IDOC)లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, గది నెం. S-26లో కోటేషన్లు స్వీకరించబడతాయి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో కోటేషన్లు తెరవనున్నట్లు తెలిపారు. 6,784 మంది విద్యార్థులకు కిట్లు జిల్లాలో పరీక్షలకు హాజరయ్యే 6,784 మంది విద్యార్థులకు అవసరమైన సామగ్రి...