టేక్మాల్ మండలానికి వరాల జల్లు రెండు గ్రామ పంచాయతీ భవనాలకు రూ.40 లక్షలు మంజూరు

డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 28, టేక్మాల్ మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరోసారి తన కట్టుబాటును చాటుకున్నారు. మండలంలోని సంగ్యా తండా, సర్మోనికుంట తండా గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు సక్రు నాయక్, రేణుక రంగ్ లాల్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.40 లక్షలను మంత్రి తక్షణమే మంజూరు చేశారు. మంజూరైన నిధులతో త్వరలోనే ఆధునిక సదుపాయాలతో భవనాల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు...