నేరేడు చర్లలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జనసేన ఆధ్వర్యంలో 500 మందికి ఉచిత వైద్య సేవలు – ముఖ్య అతిథిగా సినీ హీరో తనీష్ అల్లాడి

నేరేడుచర్ల , డైనమిక్ న్యూస్, ఫిబ్రవరి 28 నేరేడు చర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో శనివారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ స్థానిక ప్రజల్లో విశేష స్పందనను రాబట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ హీరో తనీష్ అల్లాడి హాజరై క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమాన్ని 14వ వార్డు కౌన్సిలర్ ఆరూరీ విజయలక్ష్మి సమన్వయంతో నిర్వహించారు. అభివృద్ధిలో ఆదర్శంగా 14వ వార్డు క్యాంప్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తనీష్ మాట్లాడుతూ, నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డు అభివృద్ధి పరంగా ఇతర వార్డులకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధానం ప్రశంస నీయమైనది...