కారంపూడి ఏపీ మోడల్ స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు బుక్ ఫైల్స్ పంపిణీ
కారంపూడి, డైనమిక్ న్యూస్ మార్చి 4 కారంపూడి ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి విద్యార్థులకు భారత సేవా సహకార సంస్థ ఆధ్వర్యంలో బుక్ ఫైల్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంస్థ సభ్యుడు రవి కిరణ్ విద్యార్థులకు రానున్న పదవ తరగతి పరీక్షల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మస్థైర్యంతో పరీక్షలను ఎదుర్కోవాలి రవి కుమార్ ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పరీక్షలను ఎదుర్కోవాలని సూచించారు. క్రమం తప్పకుండా బాగా చదివినప్పుడే నిజమైన ఆత్మవిశ్వాసం వస్తుందని పేర్కొన్నారు. సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలి – రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చక్ర సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్...