ఉత్తమ్ దంపతుల చిత్రపటానికి పాలాభిషేకంమంత్రి ఉత్తమ్‌తోనే మారుమూల గ్రామాల అభివృద్ధి : భూక్యా గోపాల్ నాయక్
పాలకవీడు, మార్చి 7 డైనమిక్ న్యూస్ మారుమూల గ్రామాల అభివృద్ధి సాధ్యమవ్వాలంటే భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి కీలకమని పాలకవీడు మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్ అన్నారు. మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్‌లు గుత్తికొండ భూపాల్ రెడ్డి, మునగాల వరలక్ష్మి రామంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మంత్రి దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. రూ.18 కోట్లతో డబుల్ రోడ్ మంజూరు...