కోరంపల్లిలో ఉత్సాహంగా ‘90 రోజుల ప్రణాళిక’ కార్యక్రమం పాఠశాల పరిసరాల్లో పారిశుధ్య పనులు
డైనమిక్ న్యూస్, టేక్మాల్ ప్రతినిధి | మార్చి 7 మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని కోరంపల్లి గ్రామ పంచాయతీలో ‘90 రోజుల ప్రణాళిక’ కార్యక్రమం భాగంగా శనివారం పారిశుధ్య పనులు నిర్వహించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మరియు అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బందితో కలిసి తొలగించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యార్థులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా, పరిశుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనభ్యసించేలా ఈ పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టినట్లు గ్రామ ప్రతినిధులు తెలిపారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అధికారులు ఈ సందర్భంగా కోరారు....