సీసీ రోడ్డు శంకుస్థాపన – జ్యువెలరీ షాప్ ప్రారంభంరాఘవపురం ఎక్స్ రోడ్‌లో కీసర సంతోష్ రెడ్డి కార్యక్రమాలు
డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 8 మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు పనులకు శ్రీకారం గ్రామంలోని ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించేందుకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మంజూరు చేసిన నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం అనంతరం అదే గ్రామంలో చిట్టెల నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన జ్యువెలరీ...