ప్రజల దారిని మింగేసిన అక్రమాలుస్పందించని అధికారులు
డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 8 ఎస్సారెస్పీ కెనాల్‌పై పెరుగుతున్న అక్రమాలు మోతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఎస్సారెస్పీ కెనాల్‌పై రోజురోజుకు అక్రమాలు పెరుగుతున్నాయి. ప్రజలు రాకపోకలు సాగించే మార్గాన్ని కూడా కొందరు ఆక్రమించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడవడానికి కూడా దారి లేక ప్రజల ఆవేదన కెనాల్ పక్కన ఉండే మార్గాన్ని మట్టి పోయడం, చెత్త చెదారం వేయడం, చిన్నచిన్న నిర్మాణాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఆక్రమించడంతో ప్రజలకు నడవడానికి కూడా సరైన దారి లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో రాకపోకలు కష్టంగా మారాయని తెలిపారు. నీటి ప్రవాహానికి అడ్డంకులు కెనాల్‌లో జరుగుతున్న అక్రమాల వల్ల...