వైభవంగా ప్రారంభమైన దుర్గమ్మ–పోచమ్మ జాతర ఉత్సవాలు ఐదు రోజులపాటు భక్తి శ్రద్ధల మధ్య జరిగే వేడుకలు
డైనమిక్ న్యూస్ | మార్చి 9 | టేక్మాల్ ప్రతినిధి మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో దుర్గమ్మ, పోచమ్మ అమ్మవార్ల జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో తొలి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ జాతర తొలి రోజున గ్రామ ముత్తైదువలు అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. ఉదయం నుంచే ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు కొత్త కుండల్లో బోనాలను వండి, వాటిని పూలతో అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల...