డప్పు కళను బతికిస్తున్న మహిళా కళామాతల్లులుహుజుర్‌నగర్ నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాల మహిళల విశిష్ట ప్రయత్నం

గరిడేపల్లి, మార్చి 9 (డైనమిక్ న్యూస్) అంతరించిపోతున్న డప్పు కళకు కొత్త ఊపిరి పోస్తూ హుజుర్‌నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ వాయిద్య కళ అయిన డప్పును సంరక్షించేందుకు ఈ మహిళలు నడుంబిగించి రంగంలోకి దిగారు. కాళ్లకు గజ్జెలు కట్టి “ఝం తక్ నకనక్… తరిగిడత తరిగిడతా…” అంటూ లయబద్ధంగా డప్పు దరువులు కొడుతూ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నారు.సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ నియోజకవర్గంలోని అప్పన్నపేట, పొనుగోడు, హనుమంతులగూడెం, పరెడ్డిగూడెం, దిర్శించర్ల, కల్మల్ చెర్వు, శ్రీనివాసపురం గ్రామాలకు చెందిన మహిళలు కలిసి ప్రత్యేక డప్పు బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇస్తున్నారు. అంతరించిపోతున్న కళకు కొత్త ఊపిరి ఒకప్పుడు గరిడేపల్లి మండలంలో డప్పు కళ...