నేరేడుచర్లలో ఏపీఓ ‘స్థిర రాజ్యం’…? బదిలీ నిబంధనలు పక్కనబెట్టి ఏళ్ల తరబడి ఒకే మండలంలో విధులు

నేరేడుచర్ల, మార్చి 12 (డైనమిక్ న్యూస్): నేరేడుచర్ల మండలంలో ఏపీఓగా పనిచేస్తున్న అధికారి విధుల వ్యవహారం ప్రస్తుతం మండలవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ బదిలీ నిబంధనల ప్రకారం అధికారులు ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం కొనసాగకుండా మార్పులు చేయాల్సి ఉన్నప్పటికీ, ఈ అధికారి మాత్రం ఏళ్ల తరబడి ఇదే మండలంలో కొనసాగడం పలు అనుమానాలకు తావిస్తోంది. పదేళ్లకు పైగా ఒకే మండలంలో కొనసాగింపు ఇక్కడ ప్రస్తుతం పని చేస్తున్న అధికారి గతంలో 2010 నుండి 2018 వరకు నేరేడుచర్ల మండలంలో ఏపీఓగా పనిచేశారు. అనంతరం కొంతకాలం మునగాల మండలంలో పని చేసి తర్వాత 2023లో మళ్లీ ఇదే మండలానికి బదిలీ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నారు....