వంట నూనె కల్తీ ఫిర్యాదు నేపథ్యంలో తనిఖీలుట్యాంకర్, ఆటో వాహనాల నుంచి నమూనాలు సేకరణ – పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలింపు
సూర్యాపేట బ్యూరో, మార్చి 13 ,డైనమిక్ న్యూస్ వంట నూనె కల్తీకి సంబంధించిన ఫిర్యాదు నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. జోనల్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి బి. ప్రభాకర్ శుక్రవారం పోలీసులతో కలిసి స్టేషన్‌లో సీజ్ చేసి ఉంచిన వంట నూనె వాహనాలను పరిశీలించారు. ఫిర్యాదుపై వెంటనే స్పందన స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఆహార కల్తీ ఆరోపణలపై వెంటనే స్పందించిన అధికారులు కోదాడ టౌన్ పోలీసులతో కలిసి వంట నూనెను రవాణా చేస్తున్న ట్యాంకర్ మరియు ఆటో వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా...