ప్రజల దాహార్తి తీర్చడమే నేరమా?కొత్తపల్లి గ్రామంలో పైప్‌లైన్ మరమ్మత్తుపై వివాదం

డైనమిక్ న్యూస్, టేక్మాల్ ప్రతినిధి | మార్చి 13 నీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో ఇబ్బందులుమెదక్ జిల్లా టేక్మాల్ మండలం కొరంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో నీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో కొద్ది రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను గ్రామ ప్రజలు సర్పంచ్ లక్ష్మీ ప్రసన్న వినీత్ కుమార్, ఉప సర్పంచ్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్ చొరవతో పైప్‌లైన్ మరమ్మత్తు ప్రజల సమస్యను గుర్తించిన సర్పంచ్, ఉప సర్పంచ్ వెంటనే స్పందించి రోడ్డు తవ్వించి పైప్‌లైన్ మరమ్మత్తు పనులు చేయించారు. దీంతో గ్రామానికి మళ్లీ నీటి సరఫరా పునరుద్ధరించబడింది. ఈ చర్యతో గ్రామస్థులు ఉపశమనం పొందారు. అనుమతి...