తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో 4వ తరగతి ప్రవేశాలకు ఎంపికలు నేరేడుచర్ల మండలంలో 17 వరకు మండల స్థాయి పరీక్షలు

నేరేడుచర్ల, మార్చి 16, డైనమిక్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్స్ హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు హన్మకొండలో 4వ తరగతి ప్రవేశాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా విద్యార్థులకు మండల స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి ఎం. బాలుఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ఇప్పటికే http://tgss.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న బాలబాలికలకు మార్చి 13 నుండి 17 వరకు మండల స్థాయిలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేరేడుచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీడీ యాదగిరి ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 9 రకాల మోటార్ క్వాలిటీ పరీక్షలు మండల స్థాయిలో మొత్తం 9 రకాల మోటార్...