సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దర్జాగా దందా..!– ప్రజల అవసరమే జూనియర్ అసిస్టెంట్‌కు ఆదాయ మార్గం?– మ్యారేజ్ సర్టిఫికెట్లకు వేల రూపాయల వసూళ్లు.. ఆఫీసులోనే అత్తర్ వ్యాపారం

డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 16 హుజూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మస్తాన్ జానీ అనే ఉద్యోగి ప్రజల అవసరాలను అవకాశంగా మార్చుకొని బహిరంగంగానే డబ్బులు వసూలు చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. పని కావాలంటే ముందుగా డబ్బు..! కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాడని సమాచారం. ముఖ్యంగా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వచ్చే వారిని 2000 నుండి 3000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు త్వరగా పూర్తి అవుతాయని, లేకపోతే రోజులు గడుస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ప్రతి పనికి ప్రత్యేక...