రైతు భరోసా 2025–26 యాసంగి దరఖాస్తులకు ఆహ్వానంకొత్త పాస్‌బుక్ రైతులు, ఖాతా మార్పులు చేసుకోవాల్సిన వారు అవకాశం వినియోగించుకోవాలి

డైనమిక్ న్యూస్, నేరేడు చర్ల, మార్చి 17 రైతు భరోసా 2025–26 యాసంగి సీజన్‌కు సంబంధించిన దరఖాస్తులను రైతుల నుండి స్వీకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి జావేద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులు నిర్దిష్ట గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. కొత్త పాస్‌బుక్ రైతులకు అవకాశం కొత్తగా పట్టాదార్ పాస్‌బుక్ పొందిన రైతులు మరియు 28-02-2026 వరకు డిజిటల్ సంతకం పూర్తిచేసుకున్న వారు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేయని రైతులు కూడా అర్హులు ఇంతకుముందే పాస్‌బుక్ వచ్చినప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేయని రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు....