నివాసాల మధ్య అక్రమంగా మిఠాయి కర్మాగారం ఘాటైన వాసనలు, పొగతో ప్రజలకు ఇబ్బందులు – ఆంగన్‌వాడీ చిన్నారుల ఆరోగ్యంపై ఆందోళన
హుజూర్ నగర్, డైనమిక్ న్యూస్, మార్చి 17 హుజూర్‌నగర్ పట్టణంలోని 16వ వార్డులో ప్రజల ప్రశాంత జీవనానికి అంతరాయం కలిగించే విధంగా నివాసాల మధ్య అక్రమంగా మిఠాయి తయారీ కర్మాగారం నిర్మించబడిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండ్యాల కోటేశ్వరరావు రైస్ మిల్లు వెనుక భాగంలో అనుమతులు లేకుండా నిర్మించిన ఈ షెడ్డు నుండి వస్తున్న ఘాటైన వాసనలు, విపరీతమైన పొగ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెబుతున్నారు. 35 ఏళ్లుగా ఇబ్బందులు – ఇప్పుడు మళ్లీ సమస్య స్థానికుల ప్రకారం, పెండ్యాల కోటేశ్వరరావు నిర్వహిస్తున్న రైస్ మిల్లు గత 35 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పనిచేస్తోంది. మిల్లులో వరి పొట్టు వెనుక...