పట్టు పురుగుల పెంపకంతో రైతులకు అధిక ఆదాయం
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, మార్చి 18 ప్రభుత్వ చేయూత, నూతన సాంకేతికతను వినియోగించుకుంటే రైతులు వ్యవసాయంలో అధిక ఆదాయం పొందవచ్చని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. నల్గొండకు అనుకూలమైన సెరికల్చర్ నల్గొండ జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అన్ని విధాలుగా అనుకూలమని, పంట మార్పిడిలో భాగంగా రైతులు ఈ దిశగా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పంట మార్పిడిపై దృష్టి అవసరం బుధవారం కనగల్ మండలం నరసింహపురం గ్రామంలో రైతు పుండరీకం నిర్వహిస్తున్న పట్టుపురుగుల పెంపక కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా సాగు విధానం, పెట్టుబడి, వాతావరణ అనుకూలత వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. సబ్సిడీలు – లాభాల అవకాశాలు...