ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ఖమ్మం వేదికతెలంగాణ విద్య సమితి ఆధ్వర్యంలో మార్చి 22న భారీ కార్యక్రమం

డైనమిక్ న్యూస్, హుజూర్‌నగర్, మార్చి 19 తెలంగాణ విద్య సమితి ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని స్వర్ణ భారతి ఫంక్షన్ హాల్‌లో మార్చి 22న భారీ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పెండెం తారక్ గౌడ్ తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు సంబంధించిన పోస్టర్‌ను హుజూర్‌నగర్ మునిసిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 35 యూనివర్సిటీలు పాల్గొననున్నాయి ఈ ఫెయిర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 35 ప్రముఖ యూనివర్సిటీలు పాల్గొననున్నాయని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్తుకు సంబంధించిన కోర్సులు, అడ్మిషన్లు, అవకాశాలపై నిపుణుల నుంచి పూర్తి సమాచారం పొందే...