ముస్లింలకు అండగా కాంగ్రెస్ పార్టీనే: కీసర సంతోష్ రెడ్డి

డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 17 మోతే మండలం సిరికొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముస్లింలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీయేనని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన స్పష్టం చేశారు. సర్వమత సమానత్వమే కాంగ్రెస్ లక్ష్యం దేశంలో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, వారి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అన్నారు. రంజాన్ సందర్భంగా బట్టల పంపిణీ రంజాన్ మాసాన్ని...