విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం తప్పనిసరి
డైనమిక్ న్యూస్, టేక్మల్, మార్చి 21 మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులు విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. శుక్రవారం టేక్మల్ మండలంలో పర్యటించిన ఆయన పలు సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీవీబీ పాఠశాలలో తనిఖీ టేక్మల్ కేజీవీబీ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ స్టోర్ రూమ్, కిచెన్ షెడ్‌లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, ఆహారం నాణ్యతపై వారిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చూడాలని సూచించారు. నాణ్యమైన విద్య...