నేరేడుచర్ల పీహెచ్‌సీలో సురక్షిత ప్రసవాలు – తల్లి, శిశువుల ఆరోగ్యం మెరుగ్గా

నేరేడుచర్ల, మార్చి 22, డైనమిక్ న్యూస్ నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఇటీవల నిర్వహించిన ప్రసవాలు విజయవంతంగా పూర్తయ్యాయి. వైద్య సిబ్బంది సమర్థతతో తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉండడం విశేషం. మొత్తం మూడు సాధారణ ప్రసవాలు (నార్మల్ డెలివరీలు) సజావుగా నిర్వహించబడినట్లు వైద్య అధికారి తెలిపారు. మొదటి ప్రసవం – ఆరోగ్యంగా పుట్టిన ఆడ శిశువు రావిపహాడ్ గ్రామానికి చెందిన పి. వరలక్ష్మి (G3P2D1A1) గర్భిణి సాధారణ ప్రసవం ద్వారా మార్చి 22 ఉదయం 10:08 గంటలకు 3.5 కిలోల బరువుతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వెంటనే తల్లిపాలను ప్రారంభించగా, శిశువుకు జీరో డోస్ ఇమ్యూనైజేషన్ అందించారు....