రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సాముల రాంరెడ్డి ఘన విజయం న్యాయవాదుల విశ్వాసంతో విజేతగా నిలిచిన రాంరెడ్డి
డైనమిక్ న్యూస్, హుజూర్ నగర్, మార్చి 23 తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సాముల రాంరెడ్డి ఘన విజయం సాధించారు. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో గట్టి పోటీని తట్టుకుని విజేతగా నిలవడం విశేషంగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల్లో ఆసక్తి రేపిన ఈ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఫలితాల ప్రకటన తర్వాత న్యాయవాద వర్గాల్లో సంబరాలు వెల్లివిరిశాయి. పలుచోట్ల శుభాకాంక్షలు వెల్లువెత్తగా, అనుచరులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. విజయానికి ప్రధాన కారణాలు న్యాయవాదుల విశ్వాసం, వృత్తిపట్ల నిబద్ధత, సమస్యలపై స్పష్టమైన అవగాహన—ఈ మూడు అంశాలే రాంరెడ్డి విజయానికి కీలకమయ్యాయని న్యాయవాద వర్గాలు...