లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి ఎస్సై అరవింద్ కుమార్

డైనమిక్ న్యూస్ మార్చ్ 24 టేక్మాల్ ఈ నెల 28న రాజీకి మంచి మార్గం టేక్మాల్ మండలంలో రాజీ పడదగ్గ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని టేక్మాల్ ఎస్సై అరవింద్ కుమార్ సూచించారు. మంగళవారం నాడు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసులు పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదిక ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదిక అని పేర్కొన్నారు కక్షిదారులు అర్జీదారులు ఇరువురు పరస్పర అంగీకారంతో రాజీ పడితే...