అంగన్వాడీ కేంద్రాలకు సేవా చైతన్యంవైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి కుటుంబం నుండి సమాజానికి అర్థవంతమైన కానుక

డైనమిక్ న్యూస్ , నేరేడు చర్ల, మార్చి 24 మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి తన కుమారుడు అర్జున్ రామచంద్ర రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తూ అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సదుపాయాలను అందించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పది అంగన్వాడీ కేంద్రాలకు మొత్తం వంద కుర్చీలను విరాళంగా అందజేశారు. పిల్లల సౌకర్యాల కోసం ప్రత్యేక చర్య చిన్నారుల అభ్యాసం మరియు దినచర్య కార్యకలాపాలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కుర్చీల కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ విరాళాన్ని అందించినట్లు నూకల సందీప్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు సౌకర్యవంతంగా కూర్చొని నేర్చుకునే పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక...